- పేలిన సిలిండర్.. ఒకరు సజీవ దహనం
ఆదిలాబాద్: భీంపూర్ మండలం పిప్పలకోటి సమీపంలో పెంగంగా నదిపై నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణ పనుల వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. కూలీలు వంట చేస్తుండగా సిలెండర్ పేలడంతో చుట్టూ పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో సుక్కు అనే కార్మికుడు సజీవదహనం కాగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక మంటల ఉధృతికి ఐదు టిప్పర్లు, ఒక ప్రొక్లెయిన్ యంత్రం పూర్తిగా దగ్ధం కాగా, మరో ట్రాక్టర్ తోపాటు ఇంకో వాహనానికి నిప్పు అంటుకుంది. గుడిసెల్లో పెద్దఎత్తున డీజిల్ నిల్వ చేసి ఉండటం వల్ల మంటలు భారీగా వ్యాపించినట్టు స్దానికులు చెబుతున్నారు. ఇక పెద్దఎత్తున ఎగిసిపడిన మంటలను చూసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ అగ్నిప్రమాదంలో 5 టిప్పర్లు, ఓ ప్రొక్లైయిన్లు మంటల్లో కాలిపోయాయి. కూలీలు గుడిసెలో వంట చేస్తుండగా సిలిండర్ పేలినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.