వికారాబాద్ ఎస్బీఐ బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం..

వికారాబాద్ ఎస్బీఐ బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం..

వికారాబాద్ జిల్లా ఎస్బీఐ బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం జరిగింది.. మంగళవారం ( ఏప్రిల్ 15 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని తాండూరు మండలం కరణ్ కోట్ బ్రాంచ్ లో షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ బ్యాంకును కమ్మేసింది. ఘటనపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు బ్యాంకు స్టాఫ్. 

ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. నగదు, ఆస్తి నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.