
శంషాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. శంషాబాద్ పరిధిలోని తొండపల్లి గ్రామం దగ్గర కొత్తగా నిర్మిస్తున్న ఏకం కన్వెన్షన్ హాల్లో అగ్నిప్రమాదం సంభవించటంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. గురువారం ( మార్చి 20 ) జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భారీగా ఎగసిపడుతున్న మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఎంతసేపటికి ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకోకపోవడంతో కన్వెన్షన్ హాల్లో పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో కన్వెన్షన్ హాల్ ఏరియాలోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.