శ్రీకాకులం జిల్లాలో దారుణం జరిగింది. పైడిభీమవరంలోని కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. సరక ల్యాబరేటరీస్ లో రియాక్టర్ పేలడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో కార్మికులు ఎవరు లేకపోవటంతో ప్రాణ నష్టం తప్పింది.భారీ పేలుడు సంబవించినప్పటికీ ప్రాణనష్టం తప్పటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఉన్న పలు వాహనాలు మంటల్లో దగ్ధం అయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.ఈ ఘటనకు గల కారణాలు, ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరి ప్రమేయయమైన ఉందా వంటి వివరాలు తెలియాల్సి ఉంది.