హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం (అక్టోబర్ 27) రాత్రి అబిడ్స్ పరిధిలోని బొగ్గులకుంట మయూర్ పాన్ షాప్ సమీపంలోని బాణాసంచా దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ఐదు ఫైరింజన్ల సహయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read :- ఆరోగ్యానికి డ్రైఫ్రూట్స్, గింజలు
ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అస్వస్థతకు గురికాగా.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. దుకాణాంలో బాణాసంచా ఎక్కువగా ఉండటంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఫైర్ క్రాకర్స్ షాప్ పక్కన ఉన్న హోటల్‌కు మంటలు వ్యాపించాయి. పలు వాహనాలు మంటల్లో దగ్ధం అయ్యాయి. అబిడ్స్ బొగ్గులకుంట నుండి కోఠి హనుమాన్ టెంపుల్‌కు వెళ్లే రోడ్డు మార్గంలో ఈ ఘటన జరిగింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అబిడ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు తీసిన స్థానికులు pic.twitter.com/ujClAOEbiY
— Prashanth (@itzmibadboi) October 27, 2024