ఏపీలో ఘోరం ప్రమాదం జరిగింది. దీపావళి పండగపూట పలు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని సూర్యారావు పాలెంలో బాణసంచా కేంద్రంపై పిడుగు పడటంతో పూర్తిగా దగ్దమయ్యింది. బుధవారం ( అక్టోబర్ 30, 2024 ) చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ ఘటనలో సుమారు 10 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. బాణాసంచా కేంద్రంలో పనిచేస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు.
ALSO READ | అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతి
ఘటన సమయంలో బాణసంచా తయారీ కేంద్రంలో 25 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. భారీ శబ్దంతో మంటలు చెలరేగడంతో కొంతమంది కార్మికులు వరి పొలాల వెంట పరుగులు తీశారు.ఈ ఘటనలో సుమారు 10 మందికి పైగా తీవ్రగాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను 108 లో స్తానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. ప్రాణనష్టం సంభవించకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.