మెహిదీపట్నం, వెలుగు: గుడిమల్కాపూర్ పోలీస్‌స్టేషన్‌పరిధిలోని ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాం బుధవారం రాత్రి కాలిబూడిదైంది. కార్వాన్రూట్లోని మహబూబ్ ప్రైడ్ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.
స్థానికుల సమాచారంతో పోలీసులు, లంగర్ హౌస్ ఫైర్‌సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మంటలను చూసి సమీపంలోని ఫంక్షన్హాళ్లలోని జనం పరుగులు తీశారు. ఈ ప్రమాదంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.