రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 2023, నవంబర్ 12వ తేదీ ఆదివారం జిల్లా కేంద్రంలోని సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) కార్యాలయంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కార్యాలయం భవయం రెండో అంతస్తులోని మొదటి రెండు రూమ్ లలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణమా? లేదా బానసంచ కాల్చడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందా? ఆనేది తెలియాల్సి ఉందని... ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.