చర్లపల్లి, వెలుగు: చర్లపల్లి సర్వోదయ సాల్వెంట్ కెమికల్ ఫ్యాక్టరీలో మంగళవారం సాయంత్రం చెలరేగిన బుధవారం తెల్లవారు జామున మూడు గంటలకు అదుపులోనికి వచ్చాయి. దాదాపు 10 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. కెమికల్ ఫ్యాక్టరీలోని రియాక్టర్లు పేలడంతో ప్రమాదం జరిగింది.
నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్తి నష్టం ఎంత అనేది అంచనా వేస్తున్నారు. మంటలు పక్కనే ఉన్న మహాలక్ష్మి రబ్బర్ఫ్యాక్టరీకి వ్యాపించడంతో అది కూడా పూర్తిగా దగ్ధమైంది. దాదాపు రూ.2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు కంపెనీ యాజమాన్లు తెలిపారు.