
- వీటిలో 5 థార్ లు, 4 ఎక్స్‌యూవీ 700లు, 3 ఈవీలు, త్రీఎక్స్ కారు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: కొత్తగూడలోని వీవీసీ మహీంద్రా కారు షోరూంలో గురువారం రాత్రి 9.30 గంటలకు చెలరరేగిన మంటలను ఫైర్ సిబ్బంది నాలుగు ఫైరింజన్ల సాయంతో శుక్రవారం ఉదయానికి అదుపులోకి తెచ్చారు. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో అత్యాధునిక బ్రోంటో స్కైలిప్ట్ మెషీన్‌ను రంగంలోకి దింపాల్సి వచ్చింది.
ఈ ప్రమాదంలో మొత్తం 14 కొత్త కార్లు, రూ.30 లక్షల నగదు దగ్ధమైనట్లు తేల్చారు. కాలిపోయిన కార్లలో షోరూంలో డిస్ప్లేకు ఉంచిన 5 థార్ కార్లు, 4 ఎక్స్ యూవీ 700, 3 ఈవీ కార్లు, ఓ త్రీ ఎక్స్ డెమో కారు ఉన్నాయి. క్యాష్ కౌంటర్లోని రూ.30 లక్షలు కాలిపోయినట్లు షోరూమ్ ఓనర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు.