తెలంగాణలో కార్చిచ్చు... నిర్మల్​ జిల్లాలో తగలబడుతున్న అడవులు

తెలంగాణలో కార్చిచ్చు... నిర్మల్​ జిల్లాలో తగలబడుతున్న అడవులు

నిర్మల్​ జిల్లా కడెం మండలం లక్ష్మీపూర్​ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో   కార్చిచ్చు అంటుకుంది.  దీంతో అడవిలో ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడం, అడవిలో చెట్లు, ఆకులు పూర్తిగా ఎండిపోవడం కారణంగా మంటలు అంటుకున్నట్లు భావిస్తున్నారు. కార్చిచ్చుతో పెద్దఎత్తున చెట్లు దగ్ధమయ్యాయి.  ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మంటలు విస్తరిస్తున్నాయి.  అధికారులకు స్థానికులు సమాచారం అందించినా ఇంతవరకు స్పందిచలేదని చెబుతున్నారు.  ఈ కార్చిచ్చు గురించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.