ఉత్తర మాసిడోనియాలోని నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం..51మంది మృతి

ఉత్తర మాసిడోనియాలోని నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం..51మంది మృతి

ఉత్తర మాసిడోనియాలోని ఒక నైట్‌క్లబ్‌లో ఆదివారం(మార్చి16)  భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 51 మంది మంటల్లో సజీవ దహనం అయ్యారు. దాదాపు 100 మంది తీవ్రగాయాలయ్యాయి. దక్షిణ పట్టణంలోని కొకానిలో ఓ నైట్ క్లబ్ లో తెల్లవారుజామున 2:35 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 

కొకానిలో ఓ నైట్ క్లబ్ లో స్థానిక పాప్ గ్రూప్ నిర్వహించిన కచేరీ సందర్భంగా భారీగా జనం గుమికూడారు. అయితే అక్కడ కొందరు బాణాసంచా పేల్చడంతో పైకప్పుకు మంటలు అంటుకున్నాయి. స్థానిక అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.మంటలార్పేందుకు శ్రమించారు. గాయపడ్డవారిని చికిత్స కోసం సమీప ఆస్పత్రులకు తరలించారు.  ఈ మాసివ్ ఫైర్ కు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read:-పాకిస్తాన్ లో వరుస బాంబ్ బ్లాస్ట్.. మూడో రోజు సైనికుల బస్సుపై దాడి