
బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల శివారు పెద్దబుగ్గ అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి కార్చిచ్చు అంటుకుంది. దీంతో అడవిలో ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. గత వారం రోజులుగా బెల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడం, అడవిలో చెట్లు, ఆకులు పూర్తిగా ఎండిపోవడం కారణంగా మంటలు అంటుకున్నట్లు భావిస్తున్నారు. కార్చిచ్చుతో పెద్దఎత్తున చెట్లు దగ్ధమయ్యాయి.