శివరాంపల్లిలో బట్టల షాపు​ దగ్ధం

గండిపేట/నాచారం, వెలుగు : రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని ఓ బట్టల షాపు దగ్ధమైంది. పీవీఎన్ఆర్​ఎక్స్‌‌ప్రెస్‌‌ వే పిల్లర్‌‌ నంబర్‌‌ 294 వద్ద 20 ఏండ్లుగా శ్రీలక్ష్మి క్లాత్‌‌ సెంటర్‌‌ పేరుతో బట్టల షాపు నడుస్తోంది. బుధవారం మధ్యాహ్నం ఇందులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఫైర్​ఇంజిన్​వచ్చేలోపు షాపు మొత్తం కాలి బూడిదైంది.

 దాదాపు రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని నిర్వాహకులు తెలిపారు. అలాగే మల్లాపూర్​డివిజన్​మీర్ పేటలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంచంపై నీళ్ల బకెట్​పెట్టి అందులో వాటర్​హీటర్ తో నీళ్లు వేడి చేస్తుండగా మంటలు చెలరేగాయి. మంచంతోపాటు ఇల్లు మొత్తం తగలబడింది.