కరీంనగర్ రెనీ హాస్పిటల్ దగ్గర అగ్ని ప్రమాదం.. 20 గుడిసెలు దగ్ధం

కరీంనగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని రెనీ హాస్పిటల్ దగ్గర మురికి వాడాలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్లు పేలడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు.  ఈ ప్రమాదంలో దాదాపు 20 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ తో మంటలను అదుపు చేశారు. 

ఈ ప్రమాద సమయంలో గుడిసెలల్లో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యుప్తు చేస్తామని చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.