- 13మందిని కాపాడిన పోలీస్ సిబ్బంది
ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ లో సీనియర్ సిటిజన్ కేర్ హోమ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న 13మందిని రక్షించినట్లు డిప్యూటీ కమిషనర్ చందన్ చౌదరి తెలిపారు.
తెల్లవారు జామున 5 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. సమాచారం రాగానే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రెండు గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపు చేశారు.