తాండూరులో భారీ అగ్ని ప్రమాదం.. ఎయిర్ కూలర్ షాపులో చెలరేగిన మంటలు

తాండూరులో భారీ అగ్ని ప్రమాదం.. ఎయిర్ కూలర్ షాపులో చెలరేగిన మంటలు

వికారాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. మార్చి 2వ తేదీ శనివారం రాత్రి తాండూరు పట్టణంలో AC కూలర్ల షాపులో ప్రమాదవశాత్తు మంటలు చోటుచేసుకుంది. క్రమంగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.దీంతో షాపు మొత్తం మంటల్లో కాలి బూడిదయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్ తో మంటలను అదుపు చేశారు. 

ఈ ప్రమాదంలో భారీగా ఆసినష్టం జరిగినట్లు బాధితులు వాపోయారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షాట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా?.. లేక, ఎవరైనా కావాలని చేశారా? అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.