పాతబస్తీలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం 

హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. హుస్సేన్ యాలం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎయిర్‌కూలర్ షాప్, ఆటో విడిభాగాల షాపుల్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలియగానే సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అగ్ని ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం జరిగిందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.