హైదరాబాద్ సిటీలో ఇటీవల కాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఆస్తులతోపాటు ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. 2024, జూన్ 6వ తేదీ గురువారం సాయంత్రం నాంపల్లి పటేల్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఫర్నిచర్ గోదాములో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. చుట్టూ ఉన్న ఇళ్లలోకి మంటలు వ్యాప్తించాయి.
భయాందోళనతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పారు.
మరోవైపు, నగరంలోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సేవక్ నగర్ సమీపంలోనూ భారీ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.