- సుమారు 40 లక్షల ఆస్తి నష్టం
నిజామాబాద్ క్రైమ్, వెలుగు: నిజామాబాద్ నగరంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. దేవీ రోడ్లో ఉన్న బాలాజీ సానిటరీ బిల్డింగ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఏడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. బిల్డింగ్ పూర్తిగా కాలిపోగా, రూ.40 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.