జల దిగ్బంధంలో 11 గ్రామాలు..
వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునక
కుమురంభీం జిల్లా: ప్రాణహిత నది ఉగ్రూపం దాల్చింది. భారీ గా వరద పరవళ్లు తొక్కుతుండడంతో నదికి ఇరువైపులా ఉన్న పంట పొలాలన్నీ నీట మునుగుతున్నాయి. ఉదృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత నది బెజ్జూర్ మండలంలో 11 గ్రామాలను జల దిగ్బంధం చేసింది. గ్రామాల చుట్టుముట్టుఉన్న పొలాలన్నీ నీట మునిగాయి. తలాయి, తిక్కపల్లి, భీమారం, సుశ్మీర్, సోమీని, కోయేపెళ్ళి, ఇప్పలగుడ, మోగవెళ్ళి, గేర్రే గుడ, పాత సామిని, నాగే పల్లి గ్రామాలు గతంలో ఎన్నడూ లేని వరదను చూసి భయాందోళనకు గురవుతున్నారు. రాకపోకలకు వీలు కాని రీతిలో వరద గ్రామాలను చుట్టుముట్టడం చాలా కాలం తర్వాత ఇప్పుడే చూస్తున్నామని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. వేలాది ఎకరాల పంటలన్నీ నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.