రంగారెడ్డి జిల్లాలో భారీగా విదేశీ మద్యం పట్టుబడింది. ముంబై నుండి హైదరాబాద్ కు మహబూబ్ ట్రావెల్స్ బస్సులో విదేశీ మద్యాన్ని తరలిస్తుండగా శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఏప్రిల్ 27వ తేదీ శనివారం సాయంత్రం పోలీస్ అకాడమీ జంక్షన్ దగ్గర ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలో మహబూబ్ ట్రావెల్స్ బస్సులో తనిఖీ చేసిన పోలీసులు... 55 విదేశీ మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మహబూబ్ ట్రావెల్స్ బస్సు మేనేజర్ మహమ్మద్ ఫరూక్, డ్రైవర్ హజ్రత్ అలీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో ఇద్దరు నిందితులు పరారైనట్లు తెలుస్తోంది. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.