బంకుల్లో భారీ మోసం.. 20 నుంచి 30 ఎంఎల్ తక్కువొచ్చేలా ప్రోగ్రాం

పెట్రోల్ బంకుల్లో మైక్రో చిప్‎లను అమర్చి వినియోగదారులను మోసం చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఏకంగా మూడు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు బాలా నగర్ డీసీపీ పద్మజ తెలిపారు. పెట్రోల్ బంకుల్లో సాఫ్ట్‎వేర్‎లను మార్చి మోసం చేస్తున్నారని ఆమె తెలిపారు. ఈ ముఠా మైక్రో చిప్‎ల ద్వారా 34 పెట్రోల్ బంకులలో మోసం చేసినట్లు విచారణలో తేలిందని ఆమె అన్నారు. 

‘ఫైజుల్ బారి, సందీప్, ఎండీ అస్లం అనే ముగ్గురు ముఠాగా ఏర్పడి పథకం ప్రకారం మోసం చేస్తున్నారు. వీరు ఏపీ, కర్ణాటక, తెలంగాణలో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠా 34 బంకులలో 64 పరికరాలు అమర్చి మోసం చేస్తుంది. గతంలో పెట్రోల్ బంకుల్లో పని చేసిన అనుభవం ఉండడంతో.. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మోసాలకు పాల్పడుతున్నారు. మెషిన్‎ను ట్యాపరింగ్ చేసి ఓ మైక్రో చిప్ పెట్టి మోసం చేస్తున్నారు. పెట్రోల్ కొట్టిన ప్రతిసారీ 20 నుండి 30 ఎంఎల్ వరకు తక్కువ వచ్చేలా ప్రోగ్రాం తయారు చేసి మోసం చేస్తున్నారు. ఇలాంటి మైక్రో చిప్‎లను పెట్రోల్ బంక్ డీలర్లు, యజమానులకు రెండు లక్షలు రూపాయలకు అమ్మకాలు చేశారు. ఇలా వచ్చిన డబ్బును వీరంతా సమానంగా పంచుకుంటున్నారు. ఈ ముఠాపై 6 కేసులు నమోదు చేశాం. జీడిమెట్ల, మైలార్ దేవుల పల్లి, మేడ్చల్, జవహర్ నగర్‎లో కేసులు నమోదు చేశాం. కామారెడ్డి, వనపర్తి, ఖమ్మం, సిద్ధి పేట్, నెల్లూరు, సూర్యాపేటలో కూడా ఇలాగే మోసం చేస్తున్నారు. కర్ణాటక, ఏపీలో కూడా ఈ చిప్‎ల అమ్మకాలు చేస్తూ పబ్లిక్‎ను మోసం చేస్తున్నారు. ఈ మోసాలకు సంబంధించి పెట్రోల్ బంక్ డీలర్లు, యజమానులు నలుగురిని అరెస్ట్ చేశాం. నాలుగు నెలలుగా వీరు ఈ మోసం చేస్తున్నారు. మరోసారి ఈ ముఠాను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్నీ విషయాలు బయటపడతాయి’ అని డీసీపీ పద్మజ తెలిపారు.

For More News..

హుజురాబాద్ బైపోల్ వార్.. బీజేపీ స్టార్ క్యాంపైనర్లు వీళ్ళే

ఈటలను గెలిపిస్తే గ్యాస్ ధర రూ.1500 చేస్తరు

నామినేషన్ వేసేందుకు క్యూ కట్టిన ఫీల్డ్ అసిస్టెంట్లు