
బంగారం..సంపద, ఆర్థిక భద్రతకు చిహ్నం.ముఖ్యంగా కష్టకాలంలో ఆదుకునే స్థిర ఆస్తి. ఆర్థిక సంక్షోభంలో ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తాం. ఇది కేవలం లోహమే కాదు..ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభం కూడా. అటువంటి బంగారం నిల్వలు ఉన్న దేశంలో సుసంపన్నమైంది. తాజాగా మన దేశంలో కూడా ఒకచొట బంగారం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఒడిశాలోని చాలా జిల్లాల్లో బంగారు నిల్వలు ఉన్నట్లు కనుగొన్నారు. ఒరిశా ఇప్పుడు బంగారు తవ్వకాలకు కొత్త హాట్‌స్పాట్‌గా మారింది. సుందర్‌గఢ్, నబరంగ్‌పూర్, కియోంఝర్ ,డియోగఢ్ వంటి ప్రాంతాల్లో బంగారం నిల్వలను హైలైట్ చేస్తూ బంగారు గని వేలం జరగనుందని చెప్పారు.
ఎక్కడెక్కడ బంగారు గనులున్నాయి..?
సుందర్‌గఢ్, నబరంగ్‌పూర్, కియోంఝర్,డియోగఢ్ వంటి జిల్లాల్లో బంగారు నిల్వలు ఉన్నాయి. మల్కాన్‌గిరి, సంబల్‌పూర్, బౌధ్ వంటి ఇతర ప్రాంతాలలో ఇంకా శోధనలు జరుగుతున్నాయి. జషిపూర్, సూరియాగూడ, రువాన్సి, ఇడెల్కుచా, మారేదిహి, సులేపట్, బాదంపహాడ్ వంటి మయూర్‌భంజ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా బంగారు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.
Also Read : పన్ను చెల్లింపుదారులకు కీలక అప్‌డేట్
వీటన్నింటిలో అత్యంత కీలకమైన గనిని దేవ్ ఘర్ జిల్లాలో కనుగొన్నారు. గతంలో అడసా-రాంపల్లి వద్ద బంగారు నిల్వలు గుర్తించారు. దీంతోపాలు ఈ ప్రాంతంలో రాగి కోసం G-2 స్థాయి అన్వేషణను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) నిర్వహిస్తోంది.
బంగారు నిల్వలు:
ప్రస్తుతం భారతదేశంలో 550 కి పైగా పనిచేసే బంగారు గనులు ఉన్నాయి. 2,191.53 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఉంది.2020-21 లెక్కల ప్రకారం..41 ప్రభుత్వ రంగ గనులు, 232 ప్రైవేట్ రంగ గనులు ఉన్నాయి.
భారతదేశంలో బంగారు గనుల తవ్వకం కర్ణాటకలోని కోలార్ బంగారు గనులు (KGF), హుట్టి బంగారు గనులతో సహా పలు ప్రాంతాలలో జరుగుతుంది. ఇవి భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైనవి. కోలార్ బంగారు గనులు (KGF) కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో ఉన్నాయి. ఈ గనులు భారతదేశంలోనే అతి పురాతనమైన,లోతైన బంగారు గనులలో ఒకటి.
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉన్న హుట్టి బంగారు గనులు ఉణ్నాయి. భారతదేశంలోనే అతిపెద్ద బంగారు గనిగా గుర్తింపు ఉంది. ఇక ఉత్తరప్రదేశ్ లోని సోన్ భద్ర జిల్లా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ లోని హీరాబుద్దిని, కేంద్రుకోచా గనులు కూడా బంగారు గనులకు ప్రసిద్ధి చెందాయి.