- ఆహ్వానించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లి, వెలుగు: తాండూరు మండలానికి చెందిన బీఆర్ఎస్ లీడర్లు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో సోమవారం కాంగ్రెస్లో చేరారు. తాండూర్ మండల అధ్యక్షుడు ఎండీ ఈసా, ఎంపీటీసీ సిరంగి శంకర్ ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. సింగిల్ విండో మాజీ డైరెక్టర్ మందుల జనార్ధన్, బీఆర్ఎస్ సీనియర్ లీడర్, మాజీ వార్డు మెంబర్లు పెద్దబోయిన రాజేశం, రాపర్తి ప్రశాంత్, బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు గణపతి అంజి, మండల ఉపాధ్యక్షుడు ముడిమడుగుల సురేశ్, బీఆర్ఎస్ టౌన్ లీడర్ కొయ్యడ నవీన్ గౌడ్, నాయకులు సప్ప హరీశ్, పెద్దబోయిన రాజేశం, అమనగంటి వినయ్, ఊపుట్ల అనేశ్ సహా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం ఐక్యంగా కృషి చేస్తామన్నారు. ఈ ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గెలుపును దేశంలో ఎవరూ ఆపలేరని అన్నారు. దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రమాణస్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ బడా వ్యాపారులకు తప్ప పేద ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.