గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో భారీగా చెల్లని ఓట్లు.. కౌంటింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల ఆందోళన

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో భారీగా చెల్లని ఓట్లు.. కౌంటింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల ఆందోళన

కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెల్లని ఓట్లు ఎక్కువగా నమోదు కావడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కరీంనగర్‎లోని‎‎ ఇండోర్ స్టేడియంలో జరుగుతోన్న ఎమ్మెల్సీ కౌంటింగ్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగిన ఇండిపెండెంట్ అభ్యర్థులు.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో చెల్లని ఓట్లు ఎక్కువగా రావడం వెనుక అధికారుల అలసత్వమే కారణమని ఆరోపించారు. అధికారులు ఓటు అవేర్నెస్ సరిగా చేయకపోవడం వల్లే ఓటర్లు వేసిన ఓట్లు చెల్లకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా.. గ్రాడ్యుయేట్ ఓట్ల లెక్కింపులో అధికారులు చెల్లని ఓట్లు.. చెల్లిన ఓట్ల విభజన ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో చెల్లని ఓట్లు అధికారులకు తలనొప్పిగా మారాయి. చెల్లని ఓటు నిర్ధారించే క్రమంలో పలుమార్లు అధికారులకు-, ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చెల్లని ఓట్ల ఇష్యూతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఆలస్యమవుతున్నట్టు సమాచారం. పట్టభద్రులకు అవగాహన లోపంతో అత్యధికంగా చెల్లని ఓట్లు నమోదు అయ్యాయి. 

Also Read :- మాకు కేటాయింపులు జరిగిన తర్వాతే.. ఏపీ ప్రాజెక్టులను అంగీకరిస్తాం

కొందరు బ్యాలెట్ పేపర్లపై  రైట్ గుర్తు పెట్టగా.. మరికొందరు బ్యాలెట్ పేపర్ తిరగేసి అంకెలు వేశారు. ఇలా గ్రాడ్యుయేట్ల అవగాహనా రాహిత్యంతో ఓట్లు మురిగిపోయాయి. చెల్లని ఓట్లలో బ్యాలెట్ పై 1, 2 అని రాసిన ఓట్లను పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి రవీందర్ సింగ్ ఎన్నికల  అధికారులకు విన్నవించారు.