కోల్బెల్ట్/భీమారం, వెలుగు : చెన్నూర్కాంగ్రెస్లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ వివేక్వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి సమక్షంలో కోటపల్లి మండలంలోని వివిధ గ్రామాల బీఆర్ఎస్సర్పంచులు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జనగామ సర్పంచ్ గట్టు లక్ష్మణ్ గౌడ్, ఆలుగామ సర్పంచ్, సర్పంచుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి సంతోష్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు గరిబ్ ఖాన్, ఆలుగామ ఉప సర్పంచ్ గారె సుమ, మాజీ ఎంపీటీసీ రామటెంకి వీరయ్య, మాజీ ఉప సర్పంచ్లు గట్టు రమేశ్ గౌడ్, బెజ్జల పున్నం, బీఆర్ఎస్ గ్రామ యూత్ అధ్యక్షుడు మంచాల శ్రీధర్, మండల మత్స్యకారుల సంఘం ఉపాధ్యక్షుడు బొల్లె సురేశ్, రైతు సమన్వయ సమితి సభ్యుడు కడార్ల రాజన్న, మాజీ సర్పంచ్ అల్లూరి చంద్రు, మాజీ ఉపసర్పంచ్ సంగెం శ్రీను కాంగ్రెస్లో చేరారు.
రొయ్యలపల్లి గ్రామం నుంచి మాజీ ఎంపీటీసీ రాజక్క, రాజమల్లుతోపాటు రొయ్యలపల్లి, పుల్లగామ, సిర్స, ఆలుగామ, జనగామ, వెంచపల్లి, సూపాక, నంద్రంపల్లి గ్రామాల యువత భారీ సంఖ్యలో వివేక్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అంతకుముందు చెన్నూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. చెన్నూర్ మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ పోగుల సతీశ్, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్సుద్దపల్లి సుశీల్ కాంగ్రెస్లోకి చేరారు. చెన్నూర్ నియోజకవర్గంలోని గౌడ సంఘం, మహంకాళివాడలోని పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరారు.
భీమారం మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పలువురు సీనియర్ లీడర్లు మూల రాజిరెడ్డి, చల్లా రాంరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో వారికి వివేక్ వెంకటస్వామి కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో బండం శ్రీనివాస్ రెడ్డి, రత్నమోహన్ రెడ్డి, పిట్ట రాజం, గుండా నారాయణ, సూరం గణేశ్, బొమ్మని నగేశ్, నైతం రాజబాపు, నైతం బాపు, బొమ్మని మధుకర్, ఆలం మొగిలి ఉన్నారు.