స్కూల్ గర్ల్స్పై లైంగిక దాడి..11 మంది అరెస్టు

స్కూల్ గర్ల్స్పై లైంగిక దాడి..11 మంది అరెస్టు

మతమార్పిడి ఆరోపణలు.. రాజస్థాన్​లోని బీవార్లో టెన్షన్ 

జైపూర్: రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోని బీవార్ జిల్లా మసూద పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్కూల్ విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా.. సన్ని హితంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు చూపించి బలవంతపు మతమార్పిడికి ప్రయత్నించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక వర్గానికి చెందిన యువకులు గ్యాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా ఏర్పడి సోషల్ మీడియా ద్వారా మరో వర్గం బాలికలను సంప్రదించారు. 

వారికి చైనా మొబైల్స్ గిఫ్ట్ గా ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్టు బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సన్నిహితంగా మెలిగిన ఫొటోలతో బాలికలను బ్లాక్ మెయిల్ చేసి మత మార్పిడులకు ప్రయత్నించినట్టు పోలీసులు చెప్పారు. దీంతో పలు సంస్థలు బంద్ కు పిలుపునిచ్చాయి. సమీపంలోని మార్కెట్లను మూసేశాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని ర్యాలీలు తీశాయి. ఈ కేసులో మాజీ కౌన్సిలర్ హకీమ్ ఖురేషీని పోలీసులు అరెస్టు చేశారు.

లైంగిక దాడులు, బ్లాక్ మెయిల్,  మత మార్పిడుల ఆరోపణలతో11 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు. ఇందులో మతపరమైన కోణం కూడా ఉందని తెలిసిన వెంటనే  జిల్లాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.