లారీ–ఆర్టీసీ బస్సు ఢీ.. మహిళ మృతి

ములుగు జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగపేట మండలం రాజుపేట కొత్త పెట్రోల్ బంక్ సమీపంలో తెల్లవారుజామున లారీ–ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహిళా ప్రయాణికురాలు మృతి చెందగా.. మరికొందరికి గాయాలయ్యాయి. ములుగు జిల్లా మంగపేట మండలం బ్రాహ్మణపల్లి సమీపంలోని చీపురుదుబ్బ గ్రామం మూల మలుపు వద్ద విశాఖపట్నం నుంచి వస్తున్న బస్సు.. ఇసుక లారీ ఢీకొన్నాయి. స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకోని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.