అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో సోమవారం ( మార్చి 17 ) జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతులు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని టేకులపల్లి వాసులుగా తెలుస్తోంది.సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.

మృతులు ప్రగతి రెడ్డి ( 35 ) ఆమె కుమారుడు హార్వీన్ ( 6 ), అత్త సునీత ( 56 ) అని సమాచారం. ప్రగతి రెడ్డి భర్త రోహిత్ రెడ్డి ..  చిన్న కుమారుడు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం ..ఈ సంఘటనతో టేకులపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో కారును ప్రగతి రెడ్డి భర్త రోహిత్ రెడ్డి నడుపుతున్నట్లు బంధువులు తెలిపారు .

కారు, ట్రక్కును ఢీకొండడంతో  ప్రమాదం జరిగినట్లు తెలిసింది. రోహిత్ రెడ్డి దంపతులు గత 15 సంవత్సరాలనుండి అమెరికాలో నివాసం ఉంటున్నారని బంధువులు తెలిపారు.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించటంతో వారి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.