మేడ్చల్ జిల్లా : ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలు దొంగలు బీభత్సం సృష్టించారు. ఘట్కేసర్, ద్వారక నగర్ లోని రాములు అనే వ్యక్తి ఇంట్లో చోరీ కలకలం రేపింది. రాములు ఇంట్లో మిట్ట మధ్యాహ్నం చోరీ జరిగింది. రాములు కుటుంబం.. గుడ్ ఫ్రై డే సంద్భంగా చర్చి కి వెళ్లారు. చర్చి నుంచి ఇంటికి తిరిగి వచ్చే సరికి మెయిన్ డోర్ తాళలు పగలగొట్టి ఉన్నాయి.
అది చూసి కంగారు పడ్డ రాములు.. ఇంట్లోకి పరిగెత్తి చూడగా బీరువా తాళాలు పగల గొట్టి ఉన్నాయి. బీరువాలోని రూ. 9 లక్షల, 15 తులాల బంగారం దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో రాములు పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.