వక్ఫ్ లా జేపీసీ సమావేశంలో రచ్చ రచ్చ.. బాటిల్ పగలగొట్టిన టీఎంసీ ఎంపీ..చేతికి గాయం

వక్ఫ్ లా జేపీసీ సమావేశంలో రచ్చ రచ్చ.. బాటిల్ పగలగొట్టిన టీఎంసీ ఎంపీ..చేతికి గాయం

వక్ఫ్ లా జేపీసీ సమావేశంలో గందరగోళం నెలకొంది. మంగళవారం ( అక్టోబర్ 22) సమావేశం జరుగుతుండగా.. నేతల మధ్య వాగ్వాదం ముదిరింది.  తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ గ్లాస్ బాటిల్ ను తీసుకొని టేబుల్ పై కొట్టారు . దీంతో అతని చేతికి తీవ్రగాయమైంది. సమావేశాన్ని మధ్యంతరంగా నిలిపివేశారు. బీజేపీ నేత అభిజిత్ గంగోపాధ్యాయతో వాగ్వాదం సందర్భంగా బెనర్జీ బాటిల్ ను పగలగొట్టినట్లు తెలుస్తోంది. 

2024 ఆగస్టులో లోక్ సభలో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి (జేపీసీ) పరిశీలనకు పంపిన విషయం తెలిసిందే.. మంగళవారం జేపీసీలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ కమిటీకి బీజేపీకి చెందిన జగదాంబిక పాల్ అధ్యక్షత వహించారు. కమిటీ అధికార, ప్రతిపక్ష నేతల అభిప్రాయాలను తెలుసుకుంటున్న సమయంలో బీజేపీ తీవ్ర అభ్యంతర పదజాలం వాడిందని ప్రతిపక్షాలు ఆరోపించారు. ఇదే ఆరోపణలపై విపక్ష పార్టీలపై బీజేపీ ఎదురు దాడికి దిగింది. 

ALSO READ | సీజేఐని నేనేం అనలేదు...ఎంపీ రామ్​గోపాల్ యాదవ్

ఈ క్రమంలో కమిటీ చైర్ పర్సన్ జగదాంబిక పాల్ సమావేశాన్ని నిబంధనల ప్రకారం నిర్వహించకుండా బీజేపీ సభ్యులకు సపోర్టు చేశారని.. అందుకే వారంతా అభ్యంతరకర పదజాలం వాడారని ప్రతిపక్షాలు తెలిపాయి.