గుజరాత్‌లోని కచ్‌లో ఇటీవల గుర్తించిన శిలాజాలకు సంబంధించి IIT రూర్కి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇవి ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పాముకు చెందిన వెన్నెముక భాగాలు కావొచ్చని పేర్కొంది. పనాంద్రో లిగ్నైట్ మైన్‌లో దొరికిన 27 ఎముకలు ప్రపంచంలోనే అతి పెద్ద పాము వెన్నెముకకు చెందినవని పరిశోధకులు గుర్తించారు. ఈ శిలాజాలు 4.7 కోట్ల సంవత్సరాల క్రితం నాటివని అంచనా వేస్తున్నారు. అంతరించిపోయిన మాడ్‌ట్సోయిడే కుటుంబానికి చెందిన ఈ పాము పొడవు 11 నుంచి 15 మీటర్లు ఉండొచ్చని అనుకుంటున్నారు.
ఇది ప్రపంచంలో ఇప్పటివరకు అతిపెద్ద పాముగా గుర్తింపు పొందిన టైటానోబోవాను పోలి ఉందని తెలిపారు. భారీ సైజులో ఉన్నందున ఈ పాము కూడా అనకొండలా మెల్లిగా కదలగలిగేదని భావిస్తున్నారు. ఈ పాము ఒకప్పుడు భారత్, ఆఫ్రికా, యూరోప్‌లో జీవించి అంతరించిపోయిన మాడ్ట్సోయిడై కుటుంబానికి చెందినదిగా పరిశోధకులు భావిస్తున్నారు. కాగా కొత్తగా గుర్తించిన ఈ రకం పాము జాతికి పరిశోధకులు వాసుకీ ఇండికస్ అని నామకరణం చేశారు.