వరంగల్‎లో భారీగా మావోయిస్టులు లొంగుబాటు

వరంగల్‎లో భారీగా మావోయిస్టులు లొంగుబాటు

వరంగల్: మావోయిస్టులు అడవులను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. హన్మకొండ పోలీస్ కమిషనరేట్‎లో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో గురువారం (ఏప్రిల్ 24) 14 మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీంతో సరెండర్ అయిన నక్సలైట్లకు ఐజీ రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం లొంగిపోయిన మావోయిస్టుల్లో ఛత్తీస్‎గఢ్‎కు చెందిన వారు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. 

లొంగిపోయిన మావోయస్టులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు ఏవోబీ కమిటీ సభ్యులు ఉన్నారని తెలిపారు. సరెండర్ అయిన వారిలో 28 ఏళ్ల లోపు వారే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. కర్రెగుట్టలో కూంబింగ్‎ ఆపరేషన్‎తో మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఛత్తీస్‎గఢ్ భద్రతా దళాలు ఆ ఆపరేషన్ చేపట్టాయని స్పష్టం చేశారు.