కియా పరిశ్రమలో భారీ చోరీ.. ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం

కియా పరిశ్రమలో భారీ చోరీ.. ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‎లోని శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలో భారీ చోరీ జరిగింది. జిల్లాలోని యర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న కియా పరిశ్రమలో సుమారు 900 కార్ల ఇంజిన్లు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మార్చి 19న కియా యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కియా ప్రతినిధులు అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణ కోసం పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

 దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తోంది. కియా పరిశ్రమకు కంటైనర్ల ద్వారా కార్ల ఇంజిన్లు వస్తుంటాయి. ఈ క్రమంలో చోరీ జరిగిందా..? లేదా పరిశ్రమ నుంచే ఎత్తుకెళ్లారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం కావడం హాట్ టాపిక్‎గా మారింది. విదేశీ కార్ల తయారీ కంపెనీ కావడంతో ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‎గా తీసుకున్నట్లు తెలుస్తోంది. 

►ALSO READ | బంగాళాఖాతంలో అల్పపీడనం : రాబోయే 4 రోజులు ఎండలు, వానలు