చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి టైంలో గుర్తుతెలియని వ్యక్తులు కాలేజీలోకి చొరబడి ఆఫీస్ రూమ్‌లో దాచిన రూ.15.24లక్షలు ఎత్తుకెళ్లారు. సీఐ పవన్ కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్సాగర్రోడ్డులోని విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కాలేజీలోకి మంగళవారం అర్ధరాత్రి తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు.
కిటికీ గ్రిల్స్ తొలగించి ఆఫీస్రూమ్లోకి వెళ్లారు. అక్కడి లాకర్పక్కనే ఉన్న తాళం చెవితో లాకర్‌ను ఓపెన్చేశారు. అందులోని రూ.15.24 లక్షలతో పరారయ్యారు. బుధవారం ఉదయం కాలేజీకి వచ్చి ఆఫీస్సిబ్బందికి లాకర్లోని డబ్బు కనిపించలేదు. వెంటనే మేనేజ్మెంట్దృష్టికి తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్ టీంతోపాటు సీసీఎస్ పోలీసులను రంగంలోనికి దింపారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం
మొయినాబాద్‌లోని భాస్కర మెడికల్‌కాలేజీ హాస్టల్లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా స్టూడెంట్లకు చెందిన ఫోన్లు, బుక్స్, ఇతర సామాగ్రి కాలి బూడిదైంది.