హైదరాబాద్లో భారీ చోరీ.. సుమారు రూ.2 కోట్లు విలువ చేసే బంగారం, డైమండ్స్ దొంగతనం

హైదరాబాద్లో భారీ చోరీ.. సుమారు రూ.2 కోట్లు విలువ చేసే బంగారం, డైమండ్స్ దొంగతనం

హైదరాబాద్: నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. బుధవారం రాత్రి హిమాయత్ నగర్ మినర్వ హోటల్ గల్లీలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో పని చేస్తున్న బీహార్కు చెందిన వ్యక్తి చోరీ చేసి పరారయ్యాడు. సుమారు రూ.2 కోట్లు విలువ చేసే బంగారం, డైమండ్స్, గోల్డ్ దొంగతనం చేసి పత్తా లేకుండా వెళ్లిపోయాడు. ఇంటి యజమాని దుబాయ్లో ఉండటంతో, అతని వద్ద పని చేసే అభయ్ కెడియా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుపై కేసు నమోదు చేసి నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటి యజమాని రోహిత్ కెడియా కూతురి పెళ్లి దుబాయ్లో ఉండటం వల్ల నాలుగు రోజుల క్రితం దుబాయ్కు వెళ్ళాడు. ఇంట్లో పని చేసే 20 మందికి ఓ రూమ్ ఇచ్చారు. అక్కడే పని చేసే బీహార్కు చెందిన వ్యక్తి, ఇంకొకరి సహాయంతో ఈ నెల 11 అర్ధరాత్రి.. ఇంట్లో ఉన్న 20 లక్షల నగదు , డైమండ్స్ , గోల్డ్ మొత్తం 2 కోట్లు విలువ చేసే సొత్తు చోరీ చేశాడు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా  నారాయణగూడ పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు.

నారాయణగూడ చోరీ కేసులో పురోగతి
* చోరీకి పాల్పడిన సుశీల్ను నాగ్పూర్ సమీపంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
* చోరీ చేసిన అనంతరం నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి నాగపూర్కు బయలుదేరిన సుశీల్
* అప్రమత్తమైన నారాయణగూడ పోలీసులు నాగ్పూర్ పోలీసుల సమన్వయంతో సుశీల్ను అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తరలింపు
* ప్రస్తుతం నారాయణగూడ పోలీసుల అదుపులో నిందితుడు సుశీల్