డబ్బులున్న బ్యాగ్​ను లాక్కొని క్షణాల్లో పరార్

డబ్బులున్న బ్యాగ్​ను లాక్కొని క్షణాల్లో పరార్

కరీంనగర్ :  బ్యాంకు నుంచి రూ.  15 లక్షలు డ్రా చేసుకొని వెళ్తుండగా.. దొంగలు బ్యాగ్​ను లాక్కుని  పరారయ్యారు. ఈ ఘటన సోమవారం కరీంనగర్​లో జరిగింది. స్థానిక సాయివాణి ఆర్​ఎంసీ కంపెనీలో పనిచేస్తున్న రామగిరి చంద్ర ప్రకాశ్​,  బోడ మల్లారెడ్డి సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్​లోని బ్యాంక్​లో రూ. 15లక్షలు  డ్రా చేశారు. మల్లారెడ్డి బైక్​ నడుపుతుండగా చంద్రప్రకాశ్ ​క్యాష్​ బ్యాగ్ పట్టుకుని వెనుక కూర్చున్నారు. పద్మనాయక కల్యాణ మండపం దగ్గరకు రాగానే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ​ బైక్​పై వచ్చి వారిని అడ్డుకొన్నారు.  డబ్బులున్న బ్యాగ్​ను లాక్కొని క్షణాల్లో అక్కడి నుంచి పారిపోయారు.  బాధితుల ఫిర్యాదు మేరకు టూ టౌన్​ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.