
మరికల్, వెలుగు: మండల కేంద్రానికి చెందిన కుర్వ గౌడొప్పోల రాములు కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి ఇంటికి తాళం వేసి ఆరుబయట పడుకున్నారు. కిటికీ దగ్గర ఉన్న తాళం చేతులు తీసుకుని బీరువాలో ఉన్న 40 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. దొంగలు ఇంటికి తాళం వేసి తాళం చేతులను కిటికీ దగ్గర పెట్టి వెళ్లారు. దొంగతనం జరిగినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. క్లూస్ టీం, డాగ్ స్వ్కాడ్తో తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ యోగేశ్ గౌతం, డీఎస్పీ లింగయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీఐ రాజేందర్రెడ్డి, ఎస్ఐ మురళి ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.