
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సాయిరాంనగర్ కాలనీ(చైతన్య నగర్)లో నివసిస్తున్న కమాలోద్దిన్రాత్రి తన తండ్రి ఇంటి వద్దకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది.అప్పటికే చోరీలో బిజీగా ఉన్న దొంగలు యజమాని అలికిడి వినగానే ఛార్జింగ్ పెట్టుకున్న తమ ఫోన్ వదిలేసి పరారయ్యారు. యజమాని వారిని పట్టుకోవాలని చూసిన ఫలితం లేకుండా పోయింది. 12 తులాల బంగారం, 60 తులాల వెండి, రూ.24 వేల క్యాష్ చోరీ చేసినట్లు ఆయన తెలిపారు. బాధితుడి ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.