ఇంట్లో అందరూ ఉండగానే.. 46 తులాల బంగారం చోరీ

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. 46 తులాల బంగారం, 20 తులాల వెండి రూ. 10 వేలు  దొంగిలించారు దుండగులు. 

 డిసెంబర్ 7న అర్థ రాత్రి  ఇంట్లో అందరూ  గాఢ నిద్రలో ఉన్న  సమయం చూసి దొంగతనం చేశారు దొంగలు. ఒక గదిలో నిద్రిస్తుండగానే మరో గదిలో చోరీకి పాల్పడ్డారు.  పడుకున్న సమయంలో సెంటర్ లాక్ వేయడం మరిచిపోయాడు ఇంటి యజమాని. 

Also Read :- దోమ ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది లేకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం..

మెయిన్ డోర్ పక్కనే ఉన్న కిటికీ నుంచి  డోర్ ఓపెన్ చేసుకుని ఇంట్లోకి వెళ్లాడు  దుండగుడు.. బంగారం ,వెండి తీసుకెళ్లి ఇంట్లో ఉన్న బట్టలపై,  ఇల్లంతా కారం చల్లి  వెళ్లాడు. బాధితుల ఫిర్యాదుతో  సంఘటనా స్థలానికి చేరుకున్న రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం రంగంలోకి దిగి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.