
రియల్టర్ ఇంట్లో డబ్బు, బంగారం, వెండి చోరీ
శామీర్ పేట, వెలుగు: ఓ విల్లాలో క్యాష్, బంగారం, వెండినగలను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన శామీర్‌పేట పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీ సులు, స్థానికులు తెలిపిన ప్రకారం..శామీర్‌పేటలోని సెలబ్రిటీ క్లబ్లో విల్లా నం. 9లో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారి దాసరి మహేందర్ రెడ్డి గత నెల 24న న్యూజిలాం డ్లోని తన కుమార్తె వద్దకు వెళ్లాడు. బుధవారం మహేందర్ రెడ్డి ఇంటిని క్లీన్ చేయిద్దామని అతడి బిజినెస్ పార్ట్ నర్ చింతల రంగారెడ్డి వచ్చాడు. లోపలికి వెళ్లి చూడగా ఇంట్లోని బట్టలు చిందర వందరగా ఉన్నాయి. క్యాష్, 10.5 తులాల బంగారు నగలు, కేజీన్నర వెండి, విలువైన వస్తువులు కనిపించ లేదు.
చోరీకి వచ్చిన దొంగలు ఇంట్లోనే మద్యం తాగి.. మరో రెండు బాటిళ్లను తీసుకెళ్లినట్లు రంగారెడ్డి గుర్తించాడు. వెంటనే పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగలు ఇంటిపై కప్పు అద్దం తొలగించి లోపలికి వచ్చినట్లు గుర్తించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు.