దొంగల హల్చల్.. ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ

మాహబూబాబాద్ జిల్లా బయ్యారం పరిధిలో దొంగలు హల్చల్ చేశారు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న ఎస్బీఐ(SBI) బ్యాంకులో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన జూన్ 28 అర్ద రాత్రి చోటుచేసకుంది. బ్యాంకు తలుపు, తాళం పగులగొట్టి చోరీకి యత్నించారు దుండగులు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాంకు వద్ద దొంగలు వదిలిపెట్టిన గడ్డపార, కర్రలు స్వాధీనం చేసుకున్నారు.

బయ్యారం సీఐ, ఎస్ఐ, బ్యాంకు సిబ్బంది చోరీ జరిగిన బ్యాంకును పరిశీలించారు. బ్యాంకులో భారీగానే చోరీ జరిగిఉండవచ్చు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు సిబ్బంది. అయితే ఎంత డబ్బు పోయింది తెలియాల్సివుంది. కొద్దికాలంగా బయ్యారంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. పోలీసులు పట్టించుకోవడం లేదు అంటూ స్థానికులు అరోపణలు చేస్తున్నారు.