వికారాబాద్ జిల్లాలోని పరిగి టీచర్స్ కాలనీలో ఆదివారం దొంగల బీభత్సం సృష్టించారు. చంద్రశేఖర్ అనే పంచాయతీ సెక్రటరీ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. కిచెన్ వెంటిలేటర్ అద్దాలు పగలగొట్టి ఇంట్లో చొరబడి..8 తులాల బంగారం, నాలుగున్నర లక్షల నగదును ఎత్తుకెళ్లారు.
మొదట మెయిన్ తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన దొంగలు.. దానికి సీక్రెట్ లాక్ ఉండటంతో డోర్ తెరుచుకోలేదు. బయటనుంచి కిటికీ వెంటిలేటర్ ను గడ్డపారతో పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న రెండు బీరువాల డోర్లు పగలగొట్టి నగలు, డబ్బు ఎత్తుకెళ్లారు.. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడేశారు.
సోమవారం (అక్టోబర్2) ఊరి నుంచి తిరిగొచ్చిన చంద్రశేఖర్.. ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కష్టార్జితం దొంగలపాలైందని చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా పరిగిలో వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి.