
మంచిర్యాల జిల్లా: నస్పూర్ మున్సిపాలిటీలో సింగరేణి కార్మికుడు గుమ్మడి సత్తయ్య ఇంట్లో భారీ ఎత్తున నగదు, ఆభరణాలు చోరి జరిగాయి. సోమవారం (మే27) మధ్యాహ్నం సత్తయ్య సెకండ్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్లాడు. సాయత్రం ఇంటికి తాళం వేసి భార్య వాకింగ్ కి వెళ్లింది. తాళం వేసిన అరగంటకే ఇంటికి వచ్చి చూసేసరిగి గుర్తు తెలియని వ్యక్తులు చోరికి పాల్పడ్డారు. భార్య వచ్చి చూసే సరికి ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించింది.
15 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.4,50 వేల నగదు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు బాధితులు ఫిర్యాదు చేశారు. స్థలం కొనుగోలు చేసేందుకు ఇంట్లో రూ.4లక్షల 50 ఉంచుకున్నానని సత్తయ్య తన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే కేసు ఫైల్ చేసి డాగ్ స్క్వాడ్.. క్లూస్ టీమ్ తో వచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.