
అలంపూర్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర గురువారం భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులు రావడంతో ఏపీలోని సొంత గ్రామాలకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్ కు బయలుదేరారు. దీంతో పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్ సిబ్బంది ఫాస్టాగ్ స్కానింగ్‌ను వేగవంతం చేశారు.