
శ్రీశైలం ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ జామ్తో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం సెలవు దినంతోపాటు మార్చి 27 నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలోకావడంతో ఏపీలో, తెలంగాణ, మహారాష్ట్రానుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఘాట్ రోడ్డులో పలు చోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ALSO READ | నటుడు సాయికుమార్కు కుమ్రంభీం 2024 నేషనల్ అవార్డు ప్రదానం
శ్రీశైలం టోల్ గేట్ నుంచి సాక్షి గణపతి ముఖద్వారం వరకు వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు ముఖద్వారం నుంచి దోర్నాల మార్గ మధ్యలోని ఘాట్ రోడ్లో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘట్ రోడ్డులో ఓ లారీ మలుపు వద్ద నిలిచిపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడినట్టు అధికారులు చెబుతున్నారు.
శ్రీశైలం ఘాట్ రోడ్డు భారీ ట్రాఫిక్ జామ్ తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందస్తు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు లేకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.