జీహెచ్ఎంసీలో భారీగా అధికారుల బదిలీ.. ఒకేసారి 21 మంది ట్రాన్స్‎ఫర్

హైదరాబాద్:  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో పెద్ద ఎత్తున అధికారుల బదిలీలు జరిగాయి.  ఒకేసారి 21 మంది కమిషనర్లను ప్రభుత్వం ట్రాన్స్‎ఫర్ చేసింది. బదిలీలతో  పాటు కొత్తవారికి పోస్టింగులు ఇచ్చారు. లాంగ్ స్టాండింగ్ అధికారులకు సైతం ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

శానిటేషన్, ట్రాన్స్పోర్టేషన్ అడిషనల్ కమిషనర్‎గా.. రఘు ప్రసాద్
ఎస్టేట్స్ అడిషనల్ కమిషనర్‎గా.. అశోక్ సామ్రాట్..
రెవెన్యూ, ఐటి అడిషనల్ కమిషనర్ గా ఉన్న స్నేహ శబరిష్‎కు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్‎గా అదనపు బాధ్యతలు
అడ్మిన్ అడిషనల్ కమిషనర్‎గా.. మహేష్ కులకర్ణి
రెవెన్యూ జాయింట్ కమిషనర్‎గా.. ఉమాప్రకాష్
స్పోర్ట్స్ జాయింట్ కమిషనర్‎గా.. వాణిశ్రీ
ముకుంద రెడ్డి.. డిప్యూటీ కమిషనర్ శేరిలింగంపల్లి
రజనీకాంత్ రెడ్డి.. డిప్యూటీ కమిషనర్ ఖైరతాబాద్ 
జగన్.. డిప్యూటీ కమిషనర్ కాప్రా 
మోహన్ రెడ్డి.. డిప్యూటీ కమిషనర్ చందానగర్ 
అరుణ కుమారి.. డిప్యూటీ కమిషనర్ ఫలక్నామా 
శైలజ.. డిప్యూటీ కమిషనర్ సంతోష్ నగర్ 
కే జయంతి రావు.. జాయింట్ కమిషనర్ హెల్త్ 
రాధా.. జాయింట్ కమిషనర్ ఐటి 
సేవ ఇస్లావత్.. డిప్యూటీ కమిషనర్ ఎల్బీనగర్ 
జాకియ సుల్తానా.. డిప్యూటీ కమిషనర్ యూసఫ్ గూడా 
ఎన్ సుధాంశ్.. జాయింట్ కమిషనర్ స్వచ్ఛభారత్ మిషన్ 
డి శంకర్ సింగ్.. డిప్యూటీ కమిషనర్ సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ చార్మినార్ జోన్