ఏపీలో భారీగా ఐపీఎస్‎ల బదిలీలు.. ఏసీబీ డైరెక్టర్‎గా రాజ్యలక్ష్మి

ఏపీలో భారీగా ఐపీఎస్‎ల బదిలీలు.. ఏసీబీ డైరెక్టర్‎గా రాజ్యలక్ష్మి

ఆంధ్రప్రదేశ్‎లో భారీగా ఐపీఎస్‎ల బదిలీలు జరిగాయి. మొత్తం 27 మంది అధికారులకు బదిలీలు, పోస్టింగ్స్ ఇస్తూ  ఏపీ ప్రభుత్వం 2025, జనవరి 20వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్‎గా రాజీవ్ కుమార్ మీనా నియమితులయ్యారు. 

ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్‎గా పాలరాజు, గ్రే హౌండ్స్ డీఐజీగా బాజ్జీ, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా మధుసూదన్ రెడ్డి, ఏసీబీ డైరెక్టర్‎గా రాజ్యలక్ష్మి, ఏపీఎస్సీ డీఐజీగా పకీరప్ప, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు, టెక్నికల్ సర్వీసెస్ ఐజీగా శ్రీకాంత్, ఏపీఎస్పీ ఐజీగా రాజకుమారి, కర్నూల్ ఎస్పీగా విక్రాంత్ పాటిల్, ఎర్ర చందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బరాయుడు, లీగల్, హ్యుమన్ రైట్స్ కో ఆర్డినేషన్ ఎస్పీగా సుబ్బారెడ్డిని నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న వేళ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరగడం గమనార్హం.