ముగిసిన మస్తాన్ సాయి పోలీసు కస్టడీ

ముగిసిన మస్తాన్ సాయి పోలీసు కస్టడీ
  • విచారణలో విస్తుపోయే విషయాలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: యువతుల నగ్న వీడియోలు, డ్రగ్స్‌ కేసులో మస్తాన్ సాయికి మూడు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. శనివారంతో కస్టడీ పూర్తి కావడంతో రంగారెడ్డి కోర్టులో అతడిని పోలీసులు హాజరపర్చారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. అతడి విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. యువతులకు డ్రగ్స్ ఇచ్చి సీక్రెట్ కెమెరాల ద్వారా నగ్న వీడియోలు తీసినట్లు తెలిసింది. 

అలాగే మస్తాన్ సాయి ఇంట్లో జరిగిన డ్రగ్స్ పార్టీలపై కూడా కస్టడీలో పోలీసులు విచారించారు. నార్సింగ్ పోలీసులతో పాటు నార్కోటిక్ పోలీసులు కూడా డ్రగ్స్ వ్యవహారంలో విచారణ జరిపి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. డ్రగ్స్ పార్టీలోని వీడియోలో ఉన్న వారందరూ ప్రస్తుతం పరారీలో ఉండగా, వారి కోసం గాలిస్తున్నారు.